Yesaya Naa Jeevanadivi Neeve Song Lyrics | Latest Telugu Christian Hit Song

Yesaya Naa Jeevanadivi Neeve Song Lyrics | Latest Telugu Christian Hit Song

యేసయ్యా నా జీవనాడివి నీవే – Yesaya Naa Jeevanadivi Neeve Song Lyrics

పల్లవి:- యేసయ్యా…..నా జీవనాడివి నీవే
యేసయ్యా నా గుండె చప్పుడు నీవే (2)
యేసయ్యా నీవే ప్రాణము – యేసయ్య నీవే జీవము(2)

చరణం:1- భయపడకుము నేను నీకు తోడైయున్నాను
దిగులు చెందకుము నేను నిను బలపరతునని (2)
ధైర్యపరచితివి యేసయ్యా – దినదినము నన్ను దీవించితివయ్యా (2)
యేసయ్యా నీవే ఆశ్రయం – యేసయ్యా నీవే అతిశయం (2) ॥ యేసయ్యా ||

చరణం:2- ఎందరిలో నేనున్న ఒంటరి నే అయ్యా
అందరి కన్నా నాకు మిన్న నీవయ్యా (2)
ఎన్నిక లేని నాపై నీవు – నీ ఎనలేని ప్రేమను చూపావు (2)
యేసయ్యా నిన్నే ప్రకటింతును – యేసయ్యా నీకై ఫలియింతును (2) ॥ యేసయ్యా ॥

చరణం:3- నేనే నమ్మిన వారే నను మోసపరచిననూ
కావలసినవారే నాపై కాలు దువ్విననూ (2)
నమ్మకాన్ని వమ్ము కాకుండా నా కొమ్ము కాచి దాచినావయ్యా (2)
యేసయ్యా నీవే మార్గము – యేసయ్యా నీవే గమ్యము (2) ॥ యేసయ్యా ||

For Video Song Click Here

Leave a Comment