Stuthulani Gaikonumu Song Lyrics | Latest Telugu Christian Song 2023

Stuthulani Gaikonumu Song Lyrics | Latest Telugu Christian Song

స్తుతులన్ని గైకోనుము – Stuthulani Gaikonumu Song Lyrics

పల్లవి: స్తుతులన్ని గైకోనుమో శ్రీకరుండా శ్రీమంతుడా యేసయ్యా
స్థితిగతులు సరి చేయు సార్వభౌమ త్రియేక దైవమా (2)
ఉన్నత శిఖరమున మహామహుడవు నిత్య నివాసివి తేజో మూర్తివి (2)
సర్వ జగతికి చక్ర వర్తివి (2)

విరిగిన మనసే శ్రేష్ఠ బలిగా అర్పించెదనయ్యా నలిగిన హృదినే పానార్పణగా ప్రోక్షించెదనయ్యా (2)
॥ స్తుతులన్ని ||

  1. కెరూబులు సెరాపులు నిత్యం స్తోత్రిస్తుండగా
    సృష్ట్యంతా నీ మహిమ నిరతం వివరిస్తుండగా
    అరచు పిల్ల కాకులు సకల వృక్ష సంపద
    సూర్య చంద్ర తారలు నిన్ను ప్రస్తుతించగా (2)
    అల్ప జీవినైన నా స్తుతులేపాటివి (2)
    ॥ విరిగిన ॥
  2. భువియంతా నీకృపను ఆస్వాదించుచున్నవి.
    సప్త స్వరాలు నీ నామమును స్మరణ చేయుచున్నవి (2)
    ప్రకృతిలోని అందాలు ఎగసే జలపాతాలు
    అంతు లేని అంతరిక్షం నీ కీర్తిని చాటగా (2)
    అల్ప జీవినైన నా స్తుతులేపాటివి (2)
    ॥ విరిగిన ||

For Video Song Click Here

Leave a Comment