Ninnu Talachi Song Lyrics | Latest Telugu Christian Song 2023

Ninnu Talachi Song Lyrics | Latest Telugu Christian Song 2023

నిన్ను తలచి – Ninnu Talachi Song Lyrics

పల్లవి: నిన్ను తలచి లోకం మరచి ఆరాధింతునయా
ఎన్ని తీరుల నిను స్తుతియించిన ఋణమే తీరదయా (2)
నీ దర్శనమే – నా పరవశము
నా జీవితమే – నీ వశము
నా అండ దండ కొండ కోట నీవే యేసయ్యా – నా జీవితమంతా తోడూ నీడ నీవే చాలయ్య (2)

చరణం:-1 తండ్రీ అని నిను పిలుచుటకు – లేదు నాకు అర్హత
కుమారునిగా స్వీకరించిన – నీ ప్రేమ ఎంతో స్వచ్ఛత (2)
అమ్మ ప్రేమ కన్నాను – కమ్మనైన ప్రేమతో (2)
పెంచినావయా – పోషించినావయా (2)
తరతరములు తరిగిన తరగని ప్రేమను నాపై కురిపించావయ్యా నన్ను మురిపించావయ్యా (2)
|| నిన్ను తలచి||

చరణం:-2 చెడిపోయిన రోత బ్రతుకును – వెదకి రక్షించినావు
వెనుదిరిగి చూడకుండా – వెన్నంటి యున్నావు (2)
పాపపు యిచ్చలలో చిక్కుకున్న వేళలో (2)
విడుదల నిచ్చితివి – విజయం చేకూర్చితివి (2)
నిత్యమూ నీలో ఫలియించుటకు – అభిషేకించుమయా నీ ఆత్మతో నింపుమయా (2)
||నిన్ను తలచి||

రచన, స్వరకల్పన :- Bro.G. Kotibabu Garu
గానం:- కోటిబాబు గారు & ఆశ్రిత

For Video Song Click Here

Leave a Comment