Neeve Ganam Neeve Pranam Song Lyrics | Latest Hit Christian Song 2024

Neeve Ganam Neeve Pranam Song Lyrics | Latest Hit Christian Song 2024

నీవే గానం నీవే ప్రాణం – Neeve Ganam Neeve Pranam Song Lyrics

పల్లవి : నీవే గానం నీవే ప్రాణం నీవే ధ్యానము
యేసు నీవే భాగ్యము – నాకు నీవే సర్వము (2)
శ్వాస విడిచే వరకు నీ సేవలో నుండెదను
ఆ ఆశతో నేను జీవించుచున్నాను
నిన్ను స్తుతియింతును నిన్ను కీర్తింతును
నీకై జీవింతును నీకై మరణింతును
నీకై పానార్పణముగా పోయబడుదును
||నీవే గానం||

చరణం 1:- నలిగిన వేళలలో – నన్ను వెలిగింపజేసితివి
విరిగిన సమయములో – నన్ను వికసింప జేసితివి (2)
ఇరుకులో నన్ను విశాలపరచి దీవెనలిచ్చితివి అపాయములలో ఉపాయమై ఆవేదనలలో ఆశ్రయమై
నన్నాదరించితివి అద్దరి చేర్చితివి
|| నీవే గానం ॥

చరణం 2:- ఆత్మల భారముతో – నా హృదయము నింపుమయా ఆత్మీయ వరములతో – నన్ను అభిషేకించుమయా (2)
దైవావేశాముతో నీ వాక్యము చాటింతును కనికర హృదయముతో నీ ప్రేమను పంచెదను
ఆత్మాగ్నితో నను రగిలించుమా – ఆరని జ్వాలగా నను చేయుమా
కలనైన నిను విడువనయ్యా నా ప్రభువైన యేయ్యా
|| నీవే గానం ॥
రచన, స్వరకల్పన:- Bro.G. KOTIBABU GARU

For Video Song Click Here

Leave a Comment