Neethimantula Stutulapai Song Lyrics | Latest Telugu Christian Song 2020

Neethimantula Stutulapai Song Lyrics | Latest Telugu Christian Song

నీతిమంతుల స్తుతులపై Song Lyrics

పల్లవి: నీతిమంతుల స్తుతులపై ఆశీనుడు
దుర్నీతినంత పారద్రోలు నీతి సూర్యుడు (2)
మనుజాళి రక్షణకై అవతరించిన అద్వితీయుడు (2)
అతడే అతడే శ్రీ యేసుడు మన యేసుడు (2)

చరణం:1 పాపముతో అపరాధముతో మృతుడనై యుండగా
తానే మృతి నొంది నన్ను బ్రతికించెను (2)
శ్రమల వలన శోధనలో కుమిలి యుండగా (2)
ఆయనే నా కొరకు నలిగి పోయెను (2)
కరుణించి వరమిచ్చే వరుడేసుడు మన యేసుడు (2)
॥ నీతిమంతుల ॥

చరణం:2 నిందలతో అవమానముతో అపహసించబడిన వేళ
ఆదరించు వారు లేక తల్లడిల్లిపోగా (2)
ఇదిగో నేనున్నానని ధైర్యపరచినాడు (2)
నా చెంతనే నిలిచి విజయమిచ్చినాడు (2)
అతడే అతడే శ్రీ యేసుడు మన యేసుడు (2)
॥ నీతిమంతుల ॥

For Video Song Click Here

Leave a Comment