Nee Krupa Naku Chalayya Song Lyrics | Latest Telugu Christian Song

Nee Krupa Naku Chalayya Song Lyrics | Latest Telugu Christian Song

నీ కృప నాకు చాలయ్యా – Nee Krupa Naku Chalayya Song Lyrics

పల్లవి: నీ కృప నాకు చాలయ్యా నా యేసయ్యా
నీ కృపలను తలపోయుచూ జీవించెదనయ్య (2)
కష్టములోనైనా కలిమిలోనైనా
శోధనలోనైనా సౌఖ్యములోనైనా (2)
యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా
యేసయ్యా యేసయ్యా నీవెంటే నేనయ్యా (2)
||నీ కృప నాకు ||

చరణం:1 వేలకొలది వెండి బంగారు నాణెములా కంటే నీ వాక్యమే నాకు విలువైనది
విస్తారమైన సిరి సంపదల కంటే నీ సేవయే నాకు ఘనమైనది (2)
ఆత్మల భారముతో ఆత్మాభిషేకముతో (2)
అంతము వరకు నీ సేవలో సాగెదన్ (2)
||యేసయ్య….||

చరణం:2 నీ సంఘ క్షేమమే నా ప్రాణము అది నాకు ఇల ఎంతో భాగ్యము
నీ సేవ కొరకే ఈ జీవితం కరువైన బరువైన నీకంకితం (2)
లెక్కను అప్పగించే ఆ శుభ తరుణంలో నీకు (2)
నమ్మకమైన మంచి దాసుడా అని పిలుపే చాలు (2)
||యేసయ్య….||
రచన, స్వరకల్పన:- బ్రదర్: జి. కొటిబబు గారు

For Video Song Click Here

Leave a Comment