Madhuram Madhuram Song lyrics | Latest Telugu Christian Song

Madhuram Madhuram Song lyrics | Latest Telugu Christian Song

మధురం మధురం మధురమే – Madhuram Madhuram Song lyrics

పల్లవి: మధురం మధురం మధురమే – శ్రీ యేసుని నామ స్మరణం
మధురాతి మధురం మధురమే – ప్రభు యేసుని వాక్య ధ్యానం (2)
నాదు బ్రతుకునే దర్శించి చేదు జీవితం చేదించి
మధుర మకరందమందించి మదిలో సిరులే కురిపించి (2)
మహిమాత్మతో నను వెలిగించిన యేసుని నామం యేసుని వాక్యం (2)
॥ మధురం ॥
చరణం:1- సర్వ జ్ఞాని ప్రభు యేసే – సర్వ వ్యాపి శ్రీ యేసే
సర్వ శక్తి సంపన్నుడు యేసే సర్వోన్నతుడు యేసే (2)
మా మదినే గుడిగా మలచీ మా గుండెల్లో కొలువుండి (2)
వెతలను బాపి స్థితులను మార్చిన స్తుతులకు పాత్రుడు యేసే (2)
॥ మధురం ॥

చరణం:2- ఆత్మరూపి ప్రభు యేసే వాగ్రూపి శ్రీ యేసే
అంతరంగమున ఆత్మదీపమును వెలిగించినది యేసే (2)
అక్షయమైన జీవాహారముతో అంతకంతకు మహిమను నింపుతూ (2)
అంతము వరకు ఎంతో ప్రేమను వింతగా చోపును యేయ్యా (2)
॥ మధురం ॥

For Video Song Click Here

Leave a Comment