Haddulu Leni Song Lyrics | Latest Telugu Christian Song

Haddulu Leni Song Lyrics | Latest Telugu Christian Song

హద్దులు లేని ఎల్లలులేని – Haddulu Leni Song Lyrics

పల్లవి: హద్దులు లేని ఎల్లలులేని కృపయే నీదిగా
సమృద్ధియైన కృపతో నన్ను నింపిన యేసయ్యా (2)
దాస్యములో నుండి విడిపించే నీ కృప వారసునిగా చేసెనే(2)
నేనేమైయున్నానో అది నీ కృపయేనయ్యా (4)
॥ హద్దులు ॥

చరణం:1- నీ సిల్వ దర్శనము దర్శించగా బ్రతుకంతా ప్రతిక్షణము పులకించెనే (2)
నా వ్యసనములన్నీ తీర్చగా – వ్యసనాక్రాంతుడవైతివే
నా అతిక్రమ క్రియలన్నిటి కొరకై – గాయములు పొందితివే (2)
నిర్దోషిగా తండ్రి ఎదుట నను నిలుపగా అన్యాయ తీర్పును సహించితివే (2)
॥ నేనేమైయున్నానో ॥

చరణం:2- నీ త్యాగ శీలతను తలపోయగా పరితాపమొందెను నా హృదయము (2)
నలిగిన నీ దేహము వలన – దేహము దేవాలయమాయే
ప్రవహించిన నీ రుధిర దారాలే – అహమంతటితో అనిచేనులే (2)
క్షణమైనా కృపలేక మనలేనయ్యా కనుమూయువరకు కనిపెట్టెద (2)
॥ నేనేమైయున్నానో ॥

For Video Song Click Here

Leave a Comment