Diva Kutumbam Song Lyrics | Latest Telugu Christian Song

Diva Kutumbam Song Lyrics | Latest Telugu Christian Song

దైవకుటుంబం – Diva Kutumbam Song Lyrics

పల్లవి: దైవకుటుంబం ధరణిలో దేవుని ప్రతిబింబం (2)
శాంతి శాంతోషాలకు అది నిలయం
ఆప్యాయత అనురాగాలకు ఇక ఆరంభం (2)
విశ్వాసపు వాకిళ్ళు పరిశుద్ధత లోగిళ్ళు (2)
ఆతీధ్యమిచ్చే వంటిల్లు వర్ధిల్లు నూరేళ్ళు (2)
అ.ప|| దైవకుటుంబపు సంతోషం కని విని ఎరుగని ఆనందం (4)

చరణం:1- రక్షణ పొందిన కుటుంబం – మోక్ష పురికి సోపానం
క్రమశిక్షణ కలిగిన కుటుంబం – వీక్షించు దైవ సాన్నిధ్యం (2)
అపార్ధాలు అంతరాలు లేనట్టి అన్యోన్యత – క్షుడ్రాజుల ఘుమఘుమలు గుభాలించు మా ఇంట (2)
అప్లైశ్వర్యాలకు తులతూగే కుటుంబం (2)
తరతరాలు వర్ధిల్లే కుటుంబం (2)
||దైవకుటుంబపు సంతోషం||

చరణం:2- మమతలు కలిగిన కుటుంబం – సంతృప్తినిచ్చే కుటుంబం
ధాన్య ధన వస్తు వాహనాలు – కావు మా యింటి కంభాలు (2)
భయభక్తులు దేవోక్తులు మా అన్న పానాలు – మా యొక్క నట్టింట్లో వసియించును దేవుడు (2)
పెనవేసుకున్న బంధాలే ఈ కుటుంబం (2)
కలకాలం కలిసుండే కుటుంబం (2)
||దైవకుటుంబపు సంతోషం||

For Video Song Click Here

Leave a Comment